తీరానికి తీవ్ర తుఫాను ముప్పు: ఐదు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: అమరావతి
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌కు మరో తుపాను ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రానున్న రోజుల్లో పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు సచివాలయంలో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అధికారులు స్పష్టం చేశారు.