ఈవీఎంలపై రాహుల్ గాంధీ అబద్ధాల ప్రచారం: జి. కిషన్ రెడ్డి ధ్వజం
రిపోర్టర్: సురేష్
స్థలం: హైదరాబాద్
కేరళలో కాంగ్రెస్ పార్టీ గెలుపునకు ఈవీఎంలు కాదని ఎస్ఐఆర్ కారణమని ఆ పార్టీ సీనియర్ నేత రమేష్ చెన్నితల స్వయంగా వెల్లడిస్తున్నప్పటికీ, కనీస అవగాహన లేకుండా రాహుల్ గాంధీ మాత్రం ఈవీఎంలు మరియు ఓట్ల చోరీపై పదేపదే అసత్య ప్రచారాలు చేస్తున్నారని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. కాంగ్రెస్ నాయకుల పరస్పర విరుద్ధ ప్రకటనలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ విమర్శలు గుప్పించారు.