అమరావతిలో దేశ తొలి క్వాంటమ్ బయో వ్యాలీ ఏర్పాటు
రిపోర్టర్: సురేష్
స్థలం: అమరావతి
అమరావతిలో దేశంలోనే తొలిసారిగా అత్యాధునిక సాంకేతికత, జీవశాస్త్ర పరిశోధనల కలయికతో ‘అమరావతి క్వాంటమ్ బయో వ్యాలీ’ని ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. దీన్ని జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలని కేంద్రమంత్రి జేపీ నడ్డాను కోరారు. విజయవాడలో రూ.249 కోట్లతో క్రిటికల్ కేర్ బ్లాకులు, ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ ల్యాబొరేటరీలను ప్రారంభించారు. భవిష్యత్తులో అమరావతి గ్లోబల్ బయో ఎకానమీ పవర్‌హౌస్‌గా మారుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.