వైకాపాకు భారీగా తగ్గిన విరాళాలు, ఎన్నికల సంఘానికి ఆడిట్ నివేదిక
రిపోర్టర్: రాము
స్థలం: దిల్లీ
వైకాపాకు 2025-26 ఆర్థిక సంవత్సరంలో 9 మంది దాతల నుంచి రూ.24.30 కోట్ల విరాళాలు వచ్చినట్లు ఆ పార్టీ ఎన్నికల సంఘానికి సమర్పించిన ఆడిట్ నివేదికలో వెల్లడించింది. గతేడాదితో పోలిస్తే విరాళాలు 82.64% తగ్గాయి. చెన్నైకి చెందిన గుడ్వుడ్ శాంక్చురీ అత్యధికంగా రూ.10 కోట్లు అందించింది. ఎంపీ వైవీ సుబ్బారెడ్డి రూ.1.90 కోట్లు, ఆళ్ల అయోధ్యరామిరెడ్డి రూ.1.20 కోట్లు విరాళంగా ఇచ్చారు.