సోషల్ మీడియా ట్రోలింగ్ ఎఫెక్ట్: ఆ ఫోటోను తొలగించిన బ్రూక్లిన్ బెక్హం

రిపోర్టర్: రాజేష్ స్థలం: Los Angeles

సామాజిక మాధ్యమాలలో విమర్శలు ఎదురుకావడంతో హ్యులోవీన్ పార్టీకి సంబంధించిన వివాదాస్పద ఫోటోను తన ఇన్స్టాగ్రామ్ ఖాతా నుంచి తొలగించినట్లు ప్రముఖ సెలబ్రిటీ బ్రూక్లిన్ బెక్హం తెలిపారు. లాస్ ఏంజెల్స్ లో జరిగిన ఈ వేడుకలో తన భార్య నికోలా పెల్జ్, స్నేహితుడు డామియన్ హర్లేతో కలిసి దిగిన ఫోటోపై నెటిజన్లు ట్రోల్ చేయడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ పరిణామం ప్రస్తుతం సినీ వర్గాల్ లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.