కవ్వాల అభయారణ్య సమస్యలపై ఢిల్లీలో గవ్వల శ్రీకాంత్ ఫిర్యాదు

రిపోర్టర్: Gangadhar Reporter స్థలం: జన్నారం

కవ్వాల్ అభయారణ్యంలో నెలకొన్న ప్రజల సమస్యలు వెంటనే పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకోవాలని వీబీఏ పార్టీ రాష్ట్ర కన్వీనర్ గవ్వల శ్రీకాంత్ జాతీయ మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేశారు. గురువారం న్యూఢిల్లీలోని ఎన్ హెచ్ ఆర్ సి కార్యాలయంలో చైర్మన్ను కలిసి వినతిపత్రం అందజేశారు. కవ్వాల్ అభయారణ్యానికి స్థానిక ప్రజలు వ్యతిరేకం కాదని, అయితే దీనివల్ల అభివృద్ధి పూర్తిగా ఆగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల ఇబ్బందులు తొలగించాలని కోరారు.