రాష్ట్రీయ ఏక్తా దివస్: దేశ ఐక్యత కోసం ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిజ్ఞ
రిపోర్టర్: సునీల్
స్థలం: హైదరాబాద్
దేశ ఐక్యత, సమగ్రతను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని కేంద్ర మంత్రి G Kishan Reddy పిలుపునిచ్చారు. రాష్ట్రీయ ఏక్తా దివస్ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో దేశవ్యాప్తంగా ఐక్యతా ప్రతిజ్ఞ నిర్వహించినట్లు ఆయన పేర్కొన్నారు. భేదాభిప్రాయాలను పక్కన పెట్టి దేశ రక్షణ కోసం సమాజం ఐక్యంగా నిలవాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చినట్లు G Kishan Reddy స్పష్టం చేశారు.