నయనతార 'మహా శక్తి' సినిమా అధికారిక టీజర్ విడుదల.

రిపోర్టర్: గోపి స్థలం: హైదరాబాద్

స్టార్ హీరోయిన్ నయనతార ప్రధాన పాత్రలో సుందర్ సి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం 'మహా శక్తి'. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ అధికారిక టీజర్‌ను విడుదల చేశారు. ఈ చిత్రంలో నయనతార పవర్‌ఫుల్ రోల్‌లో అలరించనున్నారు. ఈ టీజర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సినీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటూ వైరల్ అవుతోంది.