కంటి చూపును ప్రసాదించే ఉచిత వైద్య శిబిరం

రిపోర్టర్: Abdul Azeem స్థలం: ఆమనగల్లు

రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మండల పరిధిలోని కడ్తల్ లోని ఎంబీఏ గార్డెన్స్ లో ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి సహకారంతో ఆరో ఉచిత కంటి వైద్య శిబిరం ఘనంగా ప్రారంభమైంది. శంకర నేత్రాలయ వైద్యుల ఆధ్వర్యంలో జరిగిన ఈ శిబిరంలో వందలాది మందికి నేత్ర పరీక్షలు నిర్వహించి ఉచితంగా అద్దాలు, మందులు పంపిణీ చేశారు.