మేడక్ జిల్లాలో దారుణం: చేతబడులంటూ కన్నతల్లిని సజీవ దహనం చేసిన కొడుకు
రిపోర్టర్: రాము
స్థలం: Medak
మెడక్ జిల్లాలో చేతబడులు చేస్తున్నారనే అనుమానంతో కన్నతల్లిని కొడుకు సజీవ దహనం చేసినట్లు అల్లాదుర్గ్ సర్కిల్ ఇన్ స్పెక్టర్ ఎం రేణుక తెలిపారు. టేక్మల్ మండలం ఎల్లుపేట్ గ్రామానికి చెందిన కర్రె సాయమ్మ అనే నాల్బై ఏళ్ల మహిళను ఆమె కుమారుడు దుర్గేష్ ఆటో డీజిల్ పోసి హత్య చేశాడని పోలీసులు వెల్లడించారు. నిందితుడు పరారీలో ఉండగా, ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టామని అధికారులు పేర్కొన్నారు.