భారత్ ఫ్యూచర్ సిటీకి కొత్త రహదారి నిర్మాణ పనులు ప్రారంభం

రిపోర్టర్: మహేష్ స్థలం: Hyderabad

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేస్తున్న భారత్ ఫ్యూచర్ సిటీకి రహదారి కనెక్టివిటీని మరింత విస్తరించాలని అధికారులు నిర్ణయించారు. హైదరాబాద్–నాగార్జునసాగర్ హైవేలోని తక్కెళ్లపల్లి నుంచి కుర్మిద్ద, తాటిపర్తి గ్రామాల మీదుగా సుమారు ముప్పై కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఎనిమిది కిలోమీటర్ల మేర రెండు వరుసల రహదారి నిర్మాణ పనులను చేపట్టారు. పరిశ్రమల కార్యకలాపాలు పెరిగే నేపథ్యంలో భారీ వాహనాల రాకపోకలకు ఈ మార్గం ప్రత్యేకంగా ఉపయోగపడుతుందని అధికారులు తెలిపారు.