అంబాజీపేటలో మళ్లీ గ్యాస్ లీక్ కలకలం: భయాందోళనలో మాచవరం గ్రామస్థులు
రిపోర్టర్: సునీల్
స్థలం: అంబాజీపేట
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలంలోని మాచవరంలో గ్యాస్ లీక్ మళ్లీ కలకలం రేపుతోంది. ఈనెల 26వ తేదీన పంటపొలాల్లో గ్యాస్ లీకైన ప్రాంతంలోనే తాజాగా రాత్రి నుంచి మళ్లీ లీకవుతుండటంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఓఎన్జీసీ సాంకేతిక నిపుణుల బృందం లీకేజీ అరికట్టేందుకు చర్యలు చేపట్టింది. ప్రజలు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఎలాంటి ప్రమాదం ఉండదని అధికారులు స్పష్టం చేశారు.