కొత్త ప్రయోగం: హర్రర్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు నటి అదా శర్మ

రిపోర్టర్: మహేష్ స్థలం: హైదరాబాద్

హర్రర్ జోనర్ లో ప్రత్యేక గుర్తింపు ఉన్న నటి అదా శర్మ అదా కీ ఆహట్ పేరుతో కొత్త డిజిటల్ సిరీస్ను ప్రారంభించినట్లు వెల్లడించారు. వచ్చే ఏడాది తన రెండు భయానక సినిమాలు విడుదలవుతున్నాయని, అభిమానులను అంతవరకు వేచి ఉంచలేకే నేరుగా వారి ఫోన్లకే భయాన్ని తీసుకెళ్లేందుకు ఈ సిరీస్ ప్రారంభించానని ఆమె తెలిపారు. ఎలాంటి ముగింపు లేని ఈ సిరీస్ను ప్రయాణాల్ లో కూడా చూడవచ్చని, అయితే బాత్రూమ్ లో మాత్రం చూసి భయపడవద్దని సరదాగా హెచ్చరించారు.