భక్తిశ్రద్ధలతో వినాయకుడి లడ్డూ దక్కించుకున్న ఈత చెట్టు గోపాల్
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: నాగలాపురం
నాగలాపురం మండలంలో వినాయకుడి నిమజ్జన కార్యక్రమం సందర్భంగా స్థానిక గణేష్ కమిటీ ఆధ్వర్యంలో లడ్డూ వేలం పాటను అత్యంత ఘనంగా నిర్వహించారు. భక్తులు మరియు గ్రామస్థుల సమక్షంలో జరిగిన ఈ వేలం పాటలో పలువురు భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ వేలంలో బీజేపీ అభిమాని ఈత చెట్టు గోపాల్ పాల్గొని రూ.41,000లకు వినాయకుడి లడ్డూను దక్కించుకున్నారు. వినాయకుడిపై తనకున్న భక్తిని చాటుతూ లడ్డూను సొంతం చేసుకున్న గోపాల్ను గ్రామస్థులు అభినందించారు. ఈ వేడుకల్లో యువత పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తిశ్రద్ధలతో కార్యక్రమాలను విజయవంతం చేశారు.