చట్టం కంటే ఎవరూ గొప్పవారు కాదు: సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు

రిపోర్టర్: సురేష్ స్థలం: New Delhi

ఎన్నికైన ప్రజాప్రతినిధులు చట్టబద్ధతను కాపాడే బాధ్యత విస్మరించరాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వైద్యులు మరియు అధికారులపై దాడులను తీవ్రంగా ఆక్షేపించింది. థానే ఆసుపత్రిలో వైద్యులపై దాడి కేసులో శివసేన కార్పొరేటర్ రమేష్ మాత్రేతో పాటు నలుగురి బెయిల్ రద్దు చేస్తూ జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం ఈ కీలక తీర్పు వెలువరించింది. ప్రజాప్రతినిధుల దౌర్జన్యాలు సమాజ శాంతికి భంగం కలిగిస్తాయని అత్యున్నత న్యాయస్థానం హెచ్చరించింది.