రాజకీయ సంచలనం: బీఆర్ఎస్ నేత కేటీఆర్పై పోలీసులను ఆశ్రయించిన బల్మూరి వెంకట్ భార్య

రిపోర్టర్: రమేష్ స్థలం: హైదరాబాద్

తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపిన పరిణామంలో, కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ సతీమణి ఇందూజ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై పోలీసులను ఆశ్రయించినట్లు తెలిపారు. తన ఫొటోలను మార్ఫింగ్ చేసి వ్యక్తిగత జీవితాన్ని అవమానపరిచేలా సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్కు నేరుగా ఫిర్యాదు చేసినట్లు ఇందూజ మీడియా ముఖంగా వెల్లడించారు.