ఓటు హక్కు పరిరక్షణపై పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ తీవ్ర పోరాటం
రిపోర్టర్: సునీల్
స్థలం: పెద్దపల్లి
ప్రజాస్వామ్యంలో ప్రజల ఓటు హక్కు కంటే గొప్పది ఏదీ లేదని, రాజ్యాంగ విలువల పరిరక్షణ కోసమే ఈ పోరాటమని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ స్పష్టం చేశారు. ఓటర్ల జాబితాల సవరణ ప్రక్రియలో ఆరోపణలపై స్పష్టమైన సమాధానాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అధికారం ప్రజల తీర్పుతో రావాలి తప్ప రాజ్యాంగ హక్కులను హరించడం ద్వారా కాదని, ప్రజాస్వామ్య భవిష్యత్తు కోసం తాము రాజీలేని పోరాటం సాగిస్తామని ఆయన పేర్కొన్నారు.