వైద్య ఆరోగ్యశాఖ దస్త్రాల పరిశీలనలో జాప్యం తగదన్న మంత్రి సత్యకుమార్

రిపోర్టర్: రాము స్థలం: అమరావతి

మంగళగిరిలోని వైద్య ఆరోగ్యశాఖ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన సమీక్షలో మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ పాల్గొని అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. దస్త్రాల పరిశీలనలో ఎట్టి పరిస్థితుల్లోనూ జాప్యం జరగకూడదని, ఏ సమస్య అయినా పదిహేను రోజుల్లోగా పరిష్కరించాలని స్పష్టం చేశారు. అనధికారికంగా విధులకు గైర్హాజరైన వైద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.