షేక్ అహ్మద్ మృతికి సీఎం రేవంత్ రెడ్డి సంతాపం

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: హైదరాబాద్

యూఏఈ ఉపాధ్యక్షుడు, దుబాయ్ పాలకుడు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ సహోదరుడు షేక్ అహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ కన్నుమూత పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఈ దుఃఖ సమయంలో మృతుని కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు.