బాణం గుర్తుకే ఓటేయాలి: ఆర్టీసీ టీడబ్ల్యూయూ గెలుపే ధ్యేయంగా ఎమ్మెల్యే బొజ్జు పటేల్

రిపోర్టర్: Gangadhar Reporter స్థలం: జన్నారం

ఆర్టీసీ కార్మికుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ స్పష్టం చేశారు. ఉట్నూర్ ఆర్టీసీ డిపో సందర్శనలో భాగంగా నిర్వహించిన కార్మికుల సమావేశంలో ఆయన ప్రసంగించారు. సంస్థ అభివృద్ధి కాంగ్రెస్ ప్రాధాన్యమని తెలిపారు. వచ్చే గుర్తింపు సంఘం ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతు ఇస్తున్న టీడబ్ల్యూయూ యూనియన్ బాణం గుర్తుకు ఓటేసి ఘన విజయం అందించాలని కార్మికులను ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు యూనియన్ నాయకులు పాల్గొన్నారు.