రేపల్లెలో వంద పడకల ఆసుపత్రి: నాలుగు లైన్ల రైల్వే మార్గంతో భారీ ఊరట

రిపోర్టర్: నరేష్ స్థలం: బాపట్ల

రేపల్లె ప్రజల చిరకాల వాంఛ అయిన వంద పడకల ఆసుపత్రిని మంజూరు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రకటించారు. తెనాలి-రేపల్లె మధ్య నాలుగు లైన్ల రైల్వే ట్రాక్ ఏర్పాటుకు కృషి చేస్తామని ఆయన వెల్లడించారు. బాపట్ల జిల్లా పర్యటనలో భాగంగా గురువారం నిర్వహించిన ప్రజావేదిక సభలో సీఎం మాట్లాడారు. రవాణా రంగానికి రాచబాట పరుస్తామని, ప్రతి గ్రామానికీ అనుసంధానం పెంచుతామని ఆయన స్పష్టం చేశారు. సూర్యలంకను గోవా కంటే మిన్నగా అభివృద్ధి చేస్తామని చంద్రబాబు తెలిపారు.