'అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు': మాజీ మంత్రి ఆళ్ల నాని మృతిపై ప్రభుత్వం నిర్ణయం
రిపోర్టర్: హరి
స్థలం: ఏలూరు
ఆంధ్రప్రదేశ్ మాజీ ఉప ముఖ్యమంత్రి, మాజీ మంత్రి ఆళ్ల నాని గుండెపోటుతో మృతి చెందడంతో ఆయన అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విదేశాల్లో ఉన్న ఆయన కుమారులు బుధవారం రాత్రికి ఏపీకి చేరుకోనుండటంతో, కుటుంబ సభ్యుల నిర్ణయం మేరకు గురువారం ఏలూరు నగరంలో ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. వివాదరహితుడిగా ప్రజా నాయకుడిగా పేరుగాంచిన ఆయన అంతిమయాత్రకు భారీగా అభిమానులు, నాయకులు తరలివచ్చే అవకాశం ఉండటంతో పోలీసులు విస్తృత బందోబస్తు ఏర్పాటు చేశారు.