విద్యుత్ తీగలతో పెను ముప్పు పొంచివున్న గణేష్ ఉత్సవాలు

రిపోర్టర్: Chinukani Yuvaraju స్థలం: చౌటుప్పల్

చౌటుప్పల్ మండల కేంద్రంలో గణేష్ విగ్రహాల తరలింపు, మండపాల ఏర్పాటులో విద్యుత్ ప్రమాదాల నివారణకు నిర్వాహకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విద్యుత్ శాఖ ఏఈ సతీష్ సూచించారు. విగ్రహాలను తరలించే సమయంలో విద్యుత్ తీగలకు తగలకుండా అప్రమత్తంగా ఉండాలని కోరారు. ముందస్తుగా సమాచారం అందిస్తే విద్యుత్ సిబ్బందిని అందుబాటులో ఉంచి ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. మండపాల్లో నాణ్యమైన వైర్లు మాత్రమే వాడాలని ఆయన స్పష్టం చేశారు.