ఏఐవైఎఫ్ రాష్ట్ర సమితి సభ్యునిగా ఎస్కే చాంద్ పాషా ఏకగ్రీవ ఎన్నిక
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: జూలూరుపాడు
యాదగిరిగుట్టలో జరిగిన అఖిల భారత యువజన సమైక్య ఏఐవైఎఫ్ తెలంగాణ రాష్ట్ర మూడవ మహాసభల్లో జూలూరుపాడు మండలానికి చెందిన ఎస్కే చాంద్ పాషా నూతన రాష్ట్ర సమితి సభ్యునిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న నిరుద్యోగ వ్యతిరేక విధానాలను తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమం నిర్మిస్తామని ప్రభుత్వాలను హెచ్చరించారు.