నిజామాబాద్ రోబ్ నిర్మాణంపై భిక్షాటన నిరసన: సీఎంకు రూ.37,230 విరాళం
రిపోర్టర్: విజయ్
స్థలం: నిజామాబాద్
నిజామాబాద్ బీజేపీ పార్టీ కార్యాలయంలో శ్రీ దినేష్ కులాచారి ప్రెస్ మీట్ నిర్వహించినట్లు Arvind Dharmapuri వెల్లడించారు. మాధవనగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణాన్ని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ స్థానికంగా కేవలం ఇరవై ఐదు నిమిషాల్లోనే బిచ్చమెత్తి ముప్పై ఏడు వేల రెండు వందల ముప్పై రూపాయలు సేకరించినట్లు తెలిపారు. ఈ నిధులను ప్రభుత్వానికి విరాళంగా పంపిస్తున్నామని, ప్రజల ప్రాణాలను గాలికొదిలేసిన సీఎం తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నామని Arvind Dharmapuri స్పష్టం చేశారు.