ఉత్తరాఖండ్‌లో వేగంగా కరిగిపోతున్న ఇరవై మూడు హిమానీనదాలు

రిపోర్టర్: విజయ్ స్థలం: ఉత్తరాఖండ్

ఉత్తరాఖండ్‌లో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు మరియు వాతావరణ మార్పుల కారణంగా ఇరవై మూడు ప్రధాన హిమానీనదాలు వేగంగా కరిగిపోతున్నట్లు తాజా అధ్యయనంలో వెల్లడైంది. గంగోత్రి, బందర్‌పుంఛ్, చోరాబరి, ఖట్లింగ్ వంటి గ్లేసియర్లు వేగంగా కరుగుతున్నాయని వాడియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ జియాలజీ శాస్త్రవేత్తలు జ్యోతి కుమారి, గిరీష్ చంద్ర కొథియారి, అతుల్ కుమార్ పాటిదార్ మరియు మనీష్ మెహతా తెలిపారు. పిితోరాగర్, ఉత్తరకాశీ, రుద్రప్రయాగ్, టెహ్రీ జిల్లాల్లోని ఈ గ్లేసియర్ల కరుగుదలపై ఆందోళన వ్యక్తమవుతోంది.