మహిళల ఆంధ్రా ప్రీమియర్ లీగ్‌కు విజయనగరం యువతుల ఎంపిక
రిపోర్టర్: భాస్కర్
స్థలం: విజయనగరం
విజయనగరం జిల్లాకు చెందిన ఐదుగురు యువతులు మహిళల ఆంధ్రా ప్రీమియర్ లీగ్‌కు ఎంపికై సత్తా చాటారు. పుష్పితగౌడ, హర్షితగౌడ, హారిక, దివ్యశ్రీ తదితర క్రీడాకారిణులు వివిధ జట్ల ద్వారా భారీ ధరలకు అమ్ముడయ్యారు. భవిష్యత్తులో భారత జాతీయ క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించడమే తమ లక్ష్యమని ఈ యువ క్రీడాకారిణులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.