అమెరికాలో సిక్కు ట్రక్ డ్రైవర్ పై కత్తితో కిరాతక దాడి
రిపోర్టర్: సతీష్
స్థలం: అమెరికా
అమెరికాలోని వ్యోమింగ్ లో గుర్విందర్ సింగ్ అనే సిక్కు ట్రక్ డ్రైవర్ పై గుర్తుతెలియని వ్యక్తి దారుణంగా కత్తితో దాడి చేసి 17 చోట్ల గాయపరిచాడు. ఇంటర్ స్టేట్ 80 వద్ద ఉన్న బిట్టర్ క్రీక్ రెస్ట్ ఏరియాలో జరిగిన ఈ ఘటనలో బాధితుడి మెడ, ఛాతీపై తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై అమెరికన్ సిఖ్ కౌన్సిల్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ, ఇది జాతి లేదా మత విద్వేషంతో జరిగిందా అనే కోణంలో పూర్తి స్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేసింది. అనుమానితుడు ఆండ్రూ క్రిస్ బ్జ్ డాక్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.