ఖన్నాలో సంచలనం: ఇంట్ లో డ్రగ్స్ పెట్టిన ఎఎస్ఐ సస్పెన్షన్

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: Khanna

పంజాబ్ లోని ఖన్నా ప్రాంతంలో తీవ్ర కలకలం రేపిన ఘటనలో నిఘా కెమెరా ఫుటేజ్ ఆధారంగా ఒక సహాయ సబ్-ఇన్స్పెక్టర్ ను సస్పెండ్ చేసినట్లు ఎస్ఎస్పీ దర్పణ్ అహ్లువాలియా వెల్లడించారు. స్థానిక శివసేన నాయకుడు మహంత్ కశ్మీర్ గిరి నివాసంలో పోలీసులే డ్రగ్స్ ప్యాకెట్ దాచినట్లు వీడియోలో స్పష్టంగా వెలుగుచూడటంతో ఎస్పీ స్థాయి అధికారితో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు.