ప్రాణాలు కాపాడే నైపుణ్యాలపై మండపేటలో సామూహిక సీపీఆర్ శిక్షణ
రిపోర్టర్: Y.V.RAMANA
స్థలం: మండపేట
ప్రపంచ ప్రథమ చికిత్స దినోత్సవం సందర్భంగా కోనసీమ జిల్లా మండపేటలోని నారాయణరెడ్డి హాస్పిటల్ ఆవరణలో పీఎంపీ అసోసియేషన్ అధ్యక్షుడు కోన సత్యనారాయణ ఆధ్వర్యంలో సీపీఆర్, ప్రథమ చికిత్సపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన స్థానిక ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు శిక్షణ పొందిన వారికి ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. అత్యవసర సమయంలో సీపీఆర్‌పై అవగాహన ప్రాణాలను కాపాడుతుందని రెడ్‌క్రాస్ ప్రతినిధులు, పీఎంపీ నేతలు పేర్కొన్నారు.