రాప్తాడులో దారుణం: పదోతరగతి విద్యార్థినిపై రంపంతో పాశవిక దాడి
రిపోర్టర్: హరి
స్థలం: అనంతపురం
అనంతపురం జిల్లా రాప్తాడులో పదోతరగతి విద్యార్థినిపై హేమంత్ అనే యువకుడు చెట్లు నరికే రంపంతో అత్యంత అమానుషంగా దాడి చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘోర ఘటనలో బాలిక ముఖం, వీపుపై తీవ్రగాయాలై చేయి తెగిపోయిందని తెలిపారు. నిందితుడిని ధర్మవరం రైల్వే స్టేషన్ వద్ద అదుపులోకి తీసుకున్నామని, బాధితురాలికి మెరుగైన వైద్యం అందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు మంత్రి నారా లోకేష్ హామీ ఇచ్చారని అధికారులు స్పష్టం చేశారు.