అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు: బీటెక్ అభ్యర్థుల పిటిషన్ కొట్టివేత
రిపోర్టర్: వెంకట్
స్థలం: లక్నో
ఉత్తరప్రదేశ్లో జూనియర్ అనలిస్ట్ పోస్టుల భర్తీకి సంబంధించి బీటెక్ డిగ్రీ హోల్డర్లు దాఖలు చేసిన పిటిషన్ను అలహాబాద్ హైకోర్టు సోమవారం కొట్టివేసింది. శాఖాపరమైన పోస్టులకు విద్యార్హతలను నిర్ణయించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికే ఉంటుందని జస్టిస్ అలోక్ మాథుర్, జస్టిస్ అమితాబ్ కుమార్ రాయ్ ధర్మాసనం స్పష్టం చేసినట్లు న్యాయవర్గాలు వెల్లడించాయి. కేంద్ర నిబంధనలు రాష్ట్ర ప్రభుత్వాలను కట్టడి చేయలేవని కోర్టు తేల్చిచెప్పింది.