క్రికెట్ ప్రసారాల్లో సరికొత్త విప్లవం: టిక్టాక్లో టీ20 మ్యాచ్ లైవ్ స్ట్రీమింగ్

రిపోర్టర్: శివ స్థలం: క్రైస్ట్‌చర్చ్

క్రికెట్ ప్రసార రంగంలో సరికొత్త విప్లవానికి తెరలేచిందిని నిర్వాహకులు వెల్లడించారు. భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య క్రైస్ట్చర్చ్లోని హాగ్లీ ఓవల్ వేదికగా జరిగిన తొలి టీ20 మ్యాచ్ ప్రారంభ ఆరు ఓవర్ల పవర్ప్లే యాక్షన్ను ప్రముఖ షార్ట్ వీడియో ఫ్లాట్ఫామ్ టిక్టాక్లో ప్రత్యక్ష ప్రసారం చేశారు. యువ తరం ప్రేక్షకులను క్రికెట్ వైపు ఆకర్షించేందుకు న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు, బ్రాడ్కాస్టర్ స్కై సంయుక్తంగా ఈ వినూత్న నిర్ణయం తీసుకున్నట్లు బోర్డు అధికారులు తెలిపారు.