ఓటు ధ్వంసమైతే రాజ్యాంగం కూడా నాశనమైనట్టేనంటూ రాహుల్ గాంధీ ఆందోళన
రిపోర్టర్: కృష్ణ
స్థలం: తెలంగాణ
ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు ప్రాముఖ్యతను వివరిస్తూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఓటు ధ్వంసమైతే దేశ రాజ్యాంగం కూడా నాశనమైనట్టేనని ఆయన అభిప్రాయపడ్డారు. రాజ్యాంగం పనిచేయకపోతే చట్టాలకు విలువ ఉండదని, తద్వారా ప్రజాస్వామ్య సంస్థలన్నీ అర్థరహితంగా మారుతాయని ఆయన పేర్కొన్నట్లు తెలంగాణ కాంగ్రెస్ అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా వెల్లడించింది. ఓటు హక్కును కాపాడుకోవడం ప్రతి పౌరుడి బాధ్యతని ఆయన గుర్తు చేశారు.