భారత ప్రజాస్వామ్య వ్యవస్థను ప్రధాని మోదీ ధ్వంసం చేశారన్న కాంగ్రెస్

రిపోర్టర్: గోపి స్థలం: Hyderabad

దేశంలోని ప్రజాస్వామ్య వ్యవస్థను ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలు పూర్తిగా నాశనం చేస్తున్నారని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఆరోపించింది. ప్రజాస్వామ్య మూలాలను దెబ్బతీసేలా కేంద్ర ప్రభుత్వ తీరు ఉందని విమర్శించింది. రాజ్యాంగ సంస్థలపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని స్పష్టం చేసింది. దేశంలో నియంతృత్వ పోకడలు పెరిగిపోతున్నాయని, ప్రజల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.