అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ వేగవంతం: పరిశోధనలకు లక్ష కోట్లు కేటాయింపు

రిపోర్టర్: వెంకట్ స్థలం: హైదరాబాద్

వికసిత భారత్ నిర్మాణమే లక్ష్యంగా దేశంలో పరిశోధనా రంగాన్ని నిరంతరం బలోపేతం చేస్తున్నట్లు కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి వెల్లడించారు. అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ ద్వారా పరిశోధనలను మరింత వేగవంతం చేస్తున్నామని పేర్కొన్నారు. గతేడాది ఇదే వేదిక నుంచి పరిశోధన, అభివృద్ధి మరియు ఆవిష్కరణల కోసం లక్ష కోట్ల రూపాయలను కేటాయిస్తున్నట్లు తాము ఇచ్చిన ప్రతిజ్ఞను అమలు చేసే దిశగా అడుగులు వేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.