ప్రశాంత్ భూషణ్ పై దిల్లీ పోలీసుల కేసు నమోదు: మార్ఫింగ్ వీడియో కలకలం
రిపోర్టర్: విజయ్
స్థలం: దిల్లీ
రష్యా విదేశాంగ మంత్రి మార్ఫింగ్ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారనే ఆరోపణలపై సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ పై దిల్లీ పోలీసులు కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రజల్ లో అశాంతిని రెచ్చగొట్టడం, పుకార్లను వ్యాప్తి చేయడం వంటి అభియోగాలపై స్పెషల్ సెల్ లో ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పేర్కొన్నారు. ఈ వీడియో నకిలీదని విదేశాంగ శాఖ ఫ్యాక్ట్ చెక్ విభాగం స్పష్టం చేసినట్లు వెల్లడించారు.