'డైవర్షన్ నాటకాలు ఆడుతున్నారు': కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై బీజేపీ ఫైర్

రిపోర్టర్: కిరణ్ స్థలం: Hyderabad

అసెంబ్లీలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు డైవర్షన్ నాటకాలు ఆడుతున్నాయని బీజేపీ మండిపడింది. 22A భూముల వ్యవహారం, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై బీజేపీ చర్చకు పట్టుబడుతుందనే భయంతోనే ఆ రెండు పార్టీలు కుమ్మక్కయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ప్రజా సమస్యలకు మూలకారణం ఆ పార్టీలేనని విమర్శించింది.