పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదుపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు కలెక్టర్ ఆదేశం
రిపోర్టర్: సునీల్
స్థలం: ఖమ్మం
వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఓటరు నమోదుపై ప్రత్యేక దృష్టి సారించి, అర్హులైన ప్రతి పట్టభద్రుడిని ఓటరుగా నమోదు చేయాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ అధికారులను ఆదేశించారు. ఖమ్మం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ, ఓటరు జాబితా తయారీలో ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా పకడ్బందీగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. అర్హులందరికీ ఓటు హక్కు కల్పించేలా అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలనలు వేగవంతం చేయాలని దివాకర టిఎస్ తేల్చిచెప్పారు.