ప్రధాని మోదీ సేవా ప్రస్థానం స్ఫూర్తిదాయకమన్న జక్కలి రాజు యాదవ్
రిపోర్టర్: Chinukani Yuvaraju
స్థలం: చౌటుప్పల్
చౌటుప్పల్ మండలం పెద్దకొండూరు శివారులోని సాయి యాదాద్రి సేవా ఆశ్రమంలో ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రజా జీవితంలో ఇరవై ఐదు ఏళ్ల సేవలను పురస్కరించుకుని ఈ కార్యక్రమం చేపట్టారు. జిల్లా ప్రధాన కార్యదర్శి చినుకని మల్లేష్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సేవా కార్యక్రమాన్ని రాష్ట్ర కార్యదర్శి జక్కలి రాజు యాదవ్ ప్రారంభించి అందరికీ స్ఫూర్తినిచ్చారు.