దుగరాజపట్నంలో గ్రీన్ఫీల్డ్ షిప్యార్డ్ ఏర్పాటుకు ఒప్పందం కుదిరింది
రిపోర్టర్: హరి
స్థలం: Amaravati
ఆంధ్రప్రదేశ్ ను షిప్ బిల్డింగ్ మరియు మెరైన్ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్ గా అభివృద్ధి చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక ఒప్పందం కుదుర్చుకుంది. దుగరాజపట్నంలో గ్రీన్ఫీల్డ్ షిప్యార్డ్ ఏర్పాటు నిమిత్తం మజగాన్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ సంస్థతో ఈ అవగాహన ఒప్పందం జరిగింది. ముఖ్యమంత్రి సమక్షంలో జరిగిన ఈ ఒప్పందంతో రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి మరింత వేగవంతం కానుంది.