రా ఏజెన్సీ వ్యవస్థాపకుడు ఆర్ఎన్ కావ్ జీవితంపై కరణ్ జోహార్ భారీ సినిమా

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: India

భారత తొలి బాహ్య నిఘా సంస్థ రా వ్యవస్థాపకుడు రమేశ్వర్ నాథ్ కావ్ జీవితం ఆధారంగా ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ ఓ భారీ చలనచిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ధర్మ ప్రొడక్షన్స్ మరియు లియో మీడియా కలెక్టివ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా ఆయన జీవిత విశేషాలు, 1971 నాటి యుద్ధంలో రా పాత్రను చూపించనున్నారు. ఈ సినిమాను ఆగస్టు 11, 2028న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.