ఆక్స్ఫర్డ్ గ్లోబల్ సిటీస్ ఇండెక్స్‌లో ఏపీ నగరాలకు చోటు
రిపోర్టర్: వెంకట్
స్థలం: అమరావతి
గ్లోబల్ సిటీస్ ఇండెక్స్-2026 నివేదికలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నాలుగు నగరాలు చోటు దక్కించుకున్నాయని ఆక్స్ఫర్డ్ ఎకనామిక్స్ సంస్థ వెల్లడించింది. ఆర్థిక పురోగతి సాధిస్తున్న నగరాల జాబితాలో గుంటూరు, విశాఖపట్నం, నెల్లూరు, విజయవాడ ఎమర్జింగ్ స్టాండ్ఔట్స్ విభాగంలో గుర్తింపు పొందాయని సంస్థ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా వెయ్యి నగరాలను పరిశీలించి రూపొందించిన ఈ సూచీలో రాష్ట్ర నగరాలు తమ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకోవడంపై హర్షం వ్యక్తమవుతోంది.