చేనేత కార్మికుల క్యాష్ క్రెడిట్ సమస్య పరిష్కరించాలని విజ్ఞప్తి

రిపోర్టర్: Alfa News Desk స్థలం: సంస్థాన్ నారాయణపూర్

చేనేత సహకార సంఘాల్లో ఉన్న క్యాష్ క్రెడిట్ రుణాలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే మాఫీ చేయాలని నారాయణపూర్ మండలం చేనేత సహకార సంఘం అధ్యక్షుడు చిలుకూరి శ్రీనివాస్ కోరారు. సంఘాల్లో నిల్వ ఉన్న వస్త్రాలను ప్రభుత్వం కొనుగోలు చేసి చేనేత కార్మికులకు నిరంతరం పని కల్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఆదివారం చేనేత సహకార సంఘం 55వ వార్షిక మహాసభ నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ చేనేత రంగం ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరారు.