పులివెందులలో చొక్కా మడతపెట్టడంపై జగన్పై మంత్రి సత్యకుమార్ ఫైర్

రిపోర్టర్: కృష్ణ స్థలం: Amaravati

పులివెందులలో చొక్కా మడతపెట్టి సవాల్ విసిరిన మాజీ సీఎం జగన్మోహన్రెడ్డిపై వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. స్థానిక ఎన్నికల్లో హింసను రెచ్చగొట్టేందుకే జగన్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని బుధవారం ఆయన మండిపడ్డారు. నామినేషన్ల సమయంలో ప్యాలెస్కే పరిమితమైన జగన్, ఇప్పుడు చొక్కా మడతపెట్టడంలో ఆంతర్యం ఏమిటని మంత్రి నిలదీశారు. ఎన్నికల్లో హింసను ప్రోత్సహిస్తున్న జగన్కు ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని మంత్రి పిలుపునిచ్చారు.