గిరిజన మృతుడి కుటుంబానికి ఆర్థిక సాయం: అండగా నిలిచిన జనసేన
రిపోర్టర్: sankar p
స్థలం: మనుబోలు
నెల్లూరు జిల్లా మనుబోలు మండలంలో ప్రమాదవశాత్తు మృతి చెందిన గిరిజన యువకుడు ఆకాష్ కుటుంబాన్ని జనసేన నాయకులు పరామర్శించారు. బాధిత కుటుంబానికి ఇరవై మూడు వేల ఐదు వందల రూపాయల ఆర్థిక సాయం అందజేసి అండగా ఉంటామని భరోసా కల్పించారు. ఈ సాయం పట్ల కాలనీ ప్రజలు జనసేన నాయకులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.