తెలంగాణలో నాని ది ప్యారడైజ్ చిత్రానికి టికెట్ల ధరల పెంపు

రిపోర్టర్: సతీష్ స్థలం: తెలంగాణ

నేచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ది ప్యారడైజ్ చిత్రం సెప్టెంబర్ 24న విడుదల కానున్న నేపథ్యంలో తెలంగాణ హోంశాఖ టికెట్ల ధరల పెంపునకు అనుమతినిచ్చింది. సెప్టెంబర్ 23న ప్రత్యేక షోతో పాటు సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 3 వరకు సినిమా థియేటర్లలో ధరలు పెంచుకునేందుకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది.