ఉపాధ్యాయులపై దాడులు చేస్తే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించిన మంత్రి నారా లోకేశ్

రిపోర్టర్: శివ స్థలం: దిల్లీ

దిల్లీలో పర్యటిస్తున్న ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ గురువులపై జరుగుతున్న దాడుల అంశంపై తీవ్రంగా స్పందించారు. శాప్ కార్యాలయం వద్ద ఉపాధ్యాయులపై దాడులకు పాల్పడి పరారైన నిందితులపై చట్టపరమైన కేసులు నమోదయ్యాయని తెలిపారు. గురువులను కించపరిస్తే సహించేది లేదని, భవిష్యత్తులో తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. వైకాపా నాయకులు డీఎస్సీపై తప్పుడు ప్రచారాలు మానుకోవాలని, అక్టోబరులోనే ఎన్నికలు జరుగుతాయని ఆయన స్పష్టం చేశారు.