ఆదిలాబాద్ రిమ్స్ దుర్ఘటనపై బీఆర్ఎస్ నేతల తీవ్ర ఆగ్రహం
రిపోర్టర్: హరి
స్థలం: Adilabad
ఆదిలాబాద్ రిమ్స్‌లో ఏసీ పేలి ఐదుగురు చిన్నారులు మృతి చెందిన ఘటనపై బీఆర్ఎస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ మంత్రులు జోగు రామన్న, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యేలు కోవా లక్ష్మి, అనిల్ ఘటనా స్థలాన్ని పరిశీలించి బాధిత కుటుంబాలను పరామర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్లే ఈ ఘోర ప్రమాదం జరిగిందని వారు మండిపడ్డారు.