టెక్ రంగంలో పెను భారం: ఈ ఏడాది జీతాలు పెంచని జోహో

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: Hyderabad

కృత్రిమ మేధస్సు నిర్వహణ వ్యయం విపరీతంగా పెరగడం మరియు సర్వర్ల ధరలు నాలుగు రెట్లు ఎగబాకడంతో ఈ ఏడాది ఉద్యోగులకు సాధారణ వేతన పెంపు ఉండదని జోహో చీఫ్ సైంటిస్ట్ శ్రీధర్ వేంబు స్పష్టం చేశారు. ఎక్స్ వేదికగా ఈ కీలక నిర్ణయాన్ని వెల్లడించిన ఆయన, సాఫ్ట్వేర్ రంగంలో అనిశ్చితి కొనసాగుతున్నందున ఖర్చులను నియంత్రించేందుకు మార్కెటింగ్ బడ్జెట్ను కూడా గణనీయంగా తగ్గించినట్లు పేర్కొన్నారు.